కోడలి తల నరికిన అత్త..కారణం అదేనా..?

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడలి తల నరికింది అత్త. ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది. అంతేకాకుండా త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

రాయచోటిలోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ.. తన కోడలు వసుంధరను దారుణంగా హత్య చేసింది. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో, ఆమె పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. కాగా, భర్త మరణానంతరం ఆస్తులు అన్ని వసుంధర పేరు మీదకు బదిలీ అయ్యాయి. దీంతో, వసుంధర ఆస్తులను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి రాసివ్వాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది. దీంతో, వసుంధర భర్త తమ్ముడు చందు, ఆమె చిన్నత్త సుబ్బమ్మ కలిసి వసుంధరను హత్య చేయాలని ప్లాన్‌ చేశారు. అందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం వసుంధర తల నరికి మొండాన్ని వేరు చేశారు. అనంతరం, పట్టణంలో పట్టపగలే సుబ్బమ్మ ఇలా తల పట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. వసుంధర తలను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి చేసిన హత్యను పోలీసుల ముందు ఒప్పుకుంది.