“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ టాక్ : ఇది చాల హాట్ గురూ..

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ టాక్ : ఇది చాల హాట్ గురూ..

అక్కినేని నాగార్జున వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్..ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేకపోయాడు. అఖిల్ , హలో, మజ్ను అంటూ మూడు సినిమాలు చేసినప్పటికీ అవేవి కూడా మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో బొమ్మరిలు భాస్కర్ ను నమ్ముకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండడం.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా తెరకెక్కడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ ఆసక్తి పెంచగా..తాజాగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై మరింత ఆసక్తి పెంచారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే.. ప్రేమ, పెళ్లి చుట్టూ కథ ను డైరెక్టర్ నడిపించినట్లు తెలుస్తుంది. అఖిల్ మరియు పూజ హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా బాగా ఉన్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అఖిల్ పెళ్లి కోసం తాపత్రయపడే సీన్స్ అలాగే… పూజా హెగ్డే అందాల ఆరబోతతో సినిమా ఫై ఆసక్తి పెంచాయి. జాతిరత్నాలు బ్యూటీ మరియు ఈశా రెబ్బ లాంటి హీరోయిన్లు కూడా ట్రైలర్ లో కనువిందు చేశారు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే సినిమా రొమాంటిక్ తో పాటు ఎమోషనల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.