అక్టోబర్ 8న వస్తున్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అక్కినేని నాగార్జున వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్..ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేకపోయాడు. అఖిల్ , హలో, మజ్ను అంటూ మూడు సినిమాలు చేసినప్పటికీ అవేవి కూడా మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో బొమ్మరిలు భాస్కర్ ను నమ్ముకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేసాడు. గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం , గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా తెరకెక్కడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ మధ్యలో కరోనా వచ్చి సినిమా రిలీజ్ కు బ్రేక్ పడేలా చేసింది.

ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడం ..థియేటర్స్ ఓపెన్ కావడం తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను బయటకు తీసుకరావాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. తాజాగా అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అనంతమైన ప్రేమ.. నవ్వులను వినోదాన్ని పంచేందుకు వస్తున్నామని ట్విట్టర్ లో ప్రకటించారు.