ఏపీ శాసన మండలి ఛైర్మెన్ గా దళిత నేత..?

ఏపీ శాసన మండలి ఛైర్మెన్ గా దళిత నేతను జగన్ ఎంపిక చేయబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొద్దీ రోజులుగా జగన్ దళితులకు పెద్ద పీఠం వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ శాసన మండలి ఛైర్మెన్ గా గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యా మోషేన్ రాజు ను ఎంపిక చేసే ఆలోచనలో జగన్ ఉన్నారట. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు.. గత ఏడాది గవర్నర్ కోటాలో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. శాసనసభ స్పీకర్ గా ఉత్తరాంధ్ర ప్రాంతం..బీసీ వర్గానికి ఇవ్వటంతో.. ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన ఎస్సీ వర్గానికి మండలి ఛైర్మన్ ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.

మోషేన్ రాజు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ తో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దివంగత వైఎస్ అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి అప్పాయింట్మెంట్ లేకుండానే వైఎస్ కలిసిన నాయకుల్లో.. మోషేన్ ఉన్నారు. ఆ తర్వాత కాలంలో .. వైసీపీకి చేరువై..జగన్ కు దగ్గరయ్యారు. జగన్ కష్టాల్లో ఉన్న కాలంలోనూ ఆయన వెంట నడిచారు. అందుకే మోషేన్ రాజు కు ఛైర్మెన్ పదవి కట్టపెడుతున్నట్లు సమాచారం.