రష్యాలో పాక్షిక లాక్‌డౌన్‌

మాస్కో: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో పలు దేశాల్లో కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అదే సమయంలో మరణాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు అన్ని మూసివేశారు.

నేటి నుంచి నవంబర్‌ 9 వరకు పాక్షిక లాక్‌డౌన్ కొనసాగనుంది. కరోనా కేసులు ఇలాగే పెరిగితే మరి కొద్ది రోజుల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 40వేలకు పైగా ఉంది. ప్రతిరోజు కరోనా వైరస్‌తో వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,159 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇది ఆల్‌టైమ్ హై అని అధికారులు అంటున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/