మ్యాచ్‌ ఓడిపోతేనే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి : రహానె…

Ajinkya Rahane
Ajinkya Rahane

జైపూర్‌: మాజీ ఛాంపియన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు వరుస ఓటముల్లో బెంగళూరుతో పోటీపడుతోంది. ఐదు మ్యాచ్‌లాడి నాలుగింట్లో ఓడిపోయింది. ఆదివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ భారీ ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌….బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో 139 పరుగులు మాత్రమే చేసింది.ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ విజృంభించడంతో 14 ఓవర్లలోనే మ్యాచ్‌కు తెరపడింది. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. అయితే ఆ జట్టు సారథి మాత్రం ఓటములతో భయపడాల్సిన పనిలేదంటున్నారు. జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాచ్‌ ఓడిపోతేనే ఎక్కువగా ఆలోచనలు వస్తుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. అంతా సవ్యంగా సాగితే మనం ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకావం ఉండదు. ఓటములు గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడాం. మూడింట్లో గెలిచే అవకాశం ఉన్నా స్వల్ఫ తేడాతో మ్యాచ్‌లు చేజారి పోయాయి. టీ20 క్రికెట్‌లో రిస్క్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. అలా అని ఓటమిని ఒకరి మీద మోపడం సరికాదు. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌్‌ చివరి వరకు ఉండేందుకు ప్రయత్నించాలి. ఛేదన కష్టమనుకున్నా మైదానంలో ప్రత్యర్థులకు మనం కనీసం 150 నుంచి 160 పరుగు లక్ష్యాన్ని నిర్ధేశించాల్సి ఉంటుంది. మనల్ని మనం మెరుగుపరుచుకుంటే విజయాలు వాటతంటవే వస్తాయని రహానెపేర్కొన్నాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/