ప్రపంచవ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,93,210 మంది మృతి

worldwide corona

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం చేస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 65 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 67,02,662 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,93,210 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 32,51,544 మంది కోలుకున్నారు. అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 19,24,051 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,10,173 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 7,12,252 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌,రష్యాలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/