భారత్‌లో మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు
4.421 కేసులు, మరణాలు 114

దిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కేవలం గడిచిన 24 గంటలలో 354 కరోనా పాజిటివ్‌కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసులు 4,421గా ఉండగా.. మరణాల సంఖ్య 114 కు చేరింది. కాగా ఇప్పటి వరకు ఈ వైరస్ బారి నుండి కోలుకుని 325 మంది భాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/