ఫ్రూట్స్‌తో మరింత బ్యూటీగా…

పండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు అందాన్ని కూడా పెంచుతాయి. పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో చర్మకాంతిపై ఆ ప్రభావాన్ని చూపుతున్నది. దీంతో ముఖంపై మచ్చలు, చర్మంకాంతిహీనంగా మారిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

More Beauty with Fruits…
More Beauty with Fruits…

భారతదేశం వంటి ఉష్ణోగ్రతదేశంలో ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. ఇవన్నీ చర్మఅందాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాగని ప్రతిదానికీ బ్యూటీపార్లర్లకు వెళ్లలేని చాలామంది ఉన్నారు. ఇంటి సామగ్రితోపాటు కొన్ని రకాల పండ్లు, కూరగాలయతో ముఖసౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలు..

అరటిపండుతో హెయిర్‌ ప్యాక్‌

రెండు అరటిపండ్లు తీసుకుని వాటిని మెత్తగా చిదిపి అందులో రెండు టేబుల్‌స్పూన్ల తేనెని కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు మెత్తగా మెరుస్తూ ఉంటుంది.

అరటిపండ్లతో జుట్టుకి మరొక ప్యాక్‌

ఆరు అరటిపండ్లు తీసుకుని అందులో రెండు గుడ్లు, అరకప్పు బీరు కలిసిన మిశ్రమాన్ని తలకు, జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా రాసుకుని అరగంట పాటు ఉంచుకుని తరువాత షాంపూతో స్నానం చేయాలి.
నిమ్మకాయ, టీ పొడులతో: వడగట్టిన ఒక గ్లాసు టీ డికాషన్‌లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. షాంపూతో తలస్నానం చేశాక ఈ నీటితో చివరగా జుట్టుని కడగాలి.

తేనె, వెనిగర్‌లతో…:

ఒక టేబుల్‌స్పూన్‌ తేనె ఒక లీటరు నీరు, టేబుల్‌స్పూన్‌ వెనిగర్‌లను తీసుకుని వీటి మిశ్రమంతో కూడా తలస్నానం అయ్యాక జుట్టుని కడిగితే జుట్టు మృదువ్ఞగా మారి మెరుస్తుంది. ఈ మిశ్రమం పొడి, సాధారణ జుట్టుకి మరింత అనువైనది.

చర్మం ముడతలు తగ్గేందుకు

ఒక గుడ్డుని, రెండు బాగా చిదిపిన అరటి పళ్లతో కలిపి మిశ్రమం తయారుచేయండి. దీనిని ముఖానికి,మెడకు రాయండి. పదిహేను నిముషాల పాటు అలాగే వదిలేసి తరువాత మొదట పాలతోనూ, అనంతరం నీటితోనూ కడగాలి.

దీనివల్ల చర్మం ముడతలు మాయమై మృదువ్ఞగా మెరుస్తుంటుంది. మోచేతులు, కాళ్ల నునుపుకోసం సాధారణంగా మోచేతులు, కాళ్లు గరుకుగా ఉంటాయి. రెండు అరటిపళ్లలో రెండు టేబుల్‌స్పూన్ల పంచదారని కలిపి ఈ మిశ్రమాన్ని పైన చెప్పిన శరీర భాగాల మీద రాస్తే ఆ భాగాలు నునుపుగానూ మంచి రంగుకి మారతాయి.

అందమైన చేతులకోసం

రెండు అరటిపళ్లు నిమ్మరసం, రెండు స్పూన్ల ఓట్‌మీల్‌ ఇవన్నీ కలిపి చేతులకు రాయాలి. ఒక క్రమపద్ధతిలో ఈ మిశ్రమంతో చేతులకు మర్దనా చేయాలి.

జుట్టుపౌష్టికత కోసం

మూడు అరటిపళ్లు తీసుకుని ఒక గుడ్డుని, రెండు స్పూన్ల శీకాయపొడి కలిపి జుట్టుకి బాగా పట్టించి అరగంటపాటు అలాగే ఉంచి తరువాత షాంపూతో తలస్నానం చేయాలి.

బంగాళాదుంపతో

సగం బంగాళాదుంప తురుములో నిమ్మరసం, ఒక టేబుల్‌స్పూన్‌ చైనా మట్టిని కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసి దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిముషాల అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. బంగాళాదుంప రసంతో ముఖసౌందర్యం పచ్చిబంగాళాదుంపని తురిమి దాని నుంచి రసాన్ని తీయాలి. ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో మొహమంతా పట్టించాలి. మొహం శుభ్రంగా ఆరేదాక ఆగి అనంతరం కడిగేయాలి.

జిడ్డు ముఖానికి టమాటాతో

టమాటా రసాన్ని ముఖానికి రాసుకుని ఆరేవరకు ఆగి తరువాత కడిగేస్తే ముఖానికి ఉన్న జిడ్డు తొలగుతుంది.

మృదుత్వాన్ని తెచ్చే టమాట:

ఒక టేబుల్‌స్పూన్‌ ముల్తానీమట్టి, ఒక నిమ్మకాయ రసం, సగం టమాట ఈ మూడింటిని మిశ్రమం చేసి ముఖానికి రాసుకుంటే జిడ్డు తగ్గి ముఖం మృదువ్ఞగా మారుతుంది.

బొప్పాయితో స్వచ్ఛత:

బొప్పాయి కాయని మెత్తగా నూరి దీనితో ముఖానికి మసాజ్‌ చేయడం ద్వారా ముఖంపై ఉన్న మృతకణాలు,మట్టితొలగి, మృదువ్ఞగా స్వచ్ఛంగా మారుతుంది.

కమిలిన చర్మానికి బొప్పాయితో

ఒక టేబుల్‌స్పూన్‌ తాజామీగడ, ఒక టేబుల్‌స్పూన్‌ పంచదార, కాయలో పావ్ఞభాగం బొప్పాయి తీసుకుని మెత్తగా నూరి దీనిని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డకట్టనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్‌ తీసుకుని ముఖానికి బాగా మర్దనా చేయాలి. ఇందులో ఉన్న పంచదార శరీర ఉష్ణోగ్రతకు కరిగే వరకు మర్దనా చేయాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/