మార్కెట్లకు మూడీస్‌ ఎఫెక్ట్‌

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets
markets

ముంబయి: అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ భారత్‌ ఆర్థికవృద్ధి రేటును తగ్గించడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుదేలయ్యాయి. చివరినిమిషంలో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. స్థిరమైన రేటింగ్‌నుంచి ప్రతికూల రేటింగ్‌ ఇచ్చిన తర్వాత మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఐటి కంపెనీలు ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, మరో ఆరు ఆర్ధిక కంపెనీల రేటింగ్స్‌ను కూడా రేటింగ్‌ ఏజెన్సీ సవరించింది. ఎగ్జిమ్‌ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, హీరోఫిన్‌కార్ప్‌, హడ్కో, ఎస్‌బిఐ సంస్థలు ప్రతికూలదిశగా ఉన్నట్లు రేటింగ్స్‌ ప్రకటించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 330 పాయింట్లు క్షీణించి 40,324 పాయింట్లవద్ద ముగిస్తే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 104 పాయింట్లు క్షీణించి 11,908 పాయింట్లవద్ద స్థిరపడింది. మొత్తంగాచూస్తే మార్కెట్లలో 2697 కంపెనీలు ట్రేడింగ్‌జరిగితే 1472 కంపెనీలు క్షీణించాయి. 1047 కంపెనీలు లాభాల్లో ముగిసాయి. 178 కంపెనీలు స్థిరంగా ముగిసినట్లుడగణాంకాలు చెపుతున్నాయి. వారం వారం పద్దతిలో చూస్తే సెన్సెక్స్‌ 0.39శాతం, నిఫ్టీ 0.14శాతం లాభపడ్డాయి. ఒకదశలో సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టానికి చేరింది. 40,749.33పాయింట్లకుసైతంవెళ్లింది. తిరిగి ఎస్‌బ్యాంకు భారీ వృద్ధిని నమోదుచేసింది.నాలుగు శాతంగా నిలిచింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/