వర్షాకాలం- చర్మసంరక్షణ

అందమే ఆనదం

Monsoon- skin care
Monsoon- skin care

వానాకాలం చల్లదనానికి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఈ కాలంలో వాతావరణంలోని దుమ్ము, కాలుష్యం ప్రభావంతో చర్మం కొత్త సమస్యలను ఎదుర్కొంటుంది.

చర్మ తత్వానికి తగిన స్కిన్‌ కేర్ తప్పక తీసుకోవాలి. వానాకాలం పొడి చర్మం కలిగిన వారికి కొత్త ఇబ్బందులు వస్తాయి.

వర్షంలో తడిచిన పొడి చర్మం మరింత పొడిగా మారుతుంది. దాంతో చర్మం నిగారింపు కోల్పోయి, చిట్లుతుంది.

చర్మాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతు చేసే స్కిన్‌ రిపేరింగ్‌ విటమిన్లు లోపిస్తే, పొడి చర్మం సమస్యలు రెట్టింపు అవుతాయి.

సబ్బులేని క్లిన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కొన్ని పాలల్లో తేనె కలిపి స్కిన్‌ టోనర్‌ తయారుచేసుకోవాలి.

Monsoon- skin care
Monsoon- skin care

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఒకసారి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. దీంతో పాటు ఎస్‌.పి.ఎఫ్‌ 30 ఉన్న సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా వాడాలి.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి ఉంటాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలు నెమ్మదింపచేస్తాయి.

కొనిన దానిమ్మ గింజలను తీసుకుని ఒక కప్పు ఓట్స్‌ను మిక్సీలో ముద్దగా చేసుకోవాలి. దీనికి తేనె జతచేసి రెండు టేబుల్‌ స్పూన్ల మజ్జిగ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.

పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం మీద మృతకణాలు వదిలి చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. జిడ్డు చర్మానికి వానాకాలంలో సమస్యలు ఎక్కువ.

ఈ చర్మంతత్వం ఉన్న వారికి నూనె గ్రంథులు వానాకాలంలో విపరీతంగా పనిచేస్తాయి. ఫలితంగా చర్మం మరింత జిడ్డుతా మారుతుంది.

చర్మపు జిడ్డుకు, వాతావరణంలోని దుమ్ము, చెమట తోడ స్కిన్‌ ఇనెఫెక్షన్లు మొదలవుతాయి. ఫలితంగా బ్లాక్‌హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ ఏర్పడతాయి.

వీటిని నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్లు ఎక్కువై చర్మం మీద గాయాలు, గుంటలు ఏర్పడతాయి. ఆయిల్‌ నియంత్రణ డీప్‌ క్లిన్సర్‌ వాడాలి.

దీంతో చర్మరంధ్రాలు శుభ్రపడి, పూడుకుపోకుండా ఉంటాయి.

చర్మంపై పిహెచ్‌ బ్యాలెన్స్‌ సమంగా ఉండడం కోసం ఆల్కహాల్‌ లేని టోనర్‌ ఎంచుకోవాలి.

సూర్యరశ్మి ప్రభావం పడకుండా జెల్‌ ఆధారిత సన్‌స్క్రీన్‌ వాడాలి.

రెండు టేబుల్‌ స్పూన్ల బొప్పాయి గుజ్జుకు ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, అరకప్పు కలబంద గుజ్జు చేర్చాలి.

ఇందులో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె కలపాలి. బొప్పాయి ఎండకు నల్లబడిన చర్మాన్ని తెల్లబరిస్తే పెరుగు మచ్చలను పోగొడుతుంది. కలబంద చర్మానికి నునుపుదనాన్నిస్తుంది.

లావెండర్‌ నూనె చర్మానికి పోషణ అందిస్తుంది.

Monsoon- skin care
Monsoon- skin care

ఈ మిశ్రమాన్ని ఫేస్‌ ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. మిశ్రమ చర్మతత్వం ఉన్న వారు యాంటీ బ్యాక్టీరియల్‌ క్లిన్సర్‌ వాడాలి.

టోనింగ్‌ కోసం నిమ్మరసంలో చల్లనినీళ్లు కలిపి వాడుకోవాలి.

నిమ్మరసం తాజాదనం అందించడంతో పాటు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.

ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే ప్రతిసారి ఎస్‌.పి.ఎఫ్‌30 ఉన్న సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా వాడాలి. మిశ్రమ చర్మానికి స్ట్రాబెర్రీ మంచి ఫలితాన్నిస్తుంది.

స్ట్రాబెర్రీ గుజ్జుకు కప్పు పెరుగు, టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి.

ఆరిన తర్వాత కడిగేసుకుంటే చర్మం జిడ్డుగా పొడిగా కాకుండా సరిపడా తేమతో తాజాగా ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/