సెప్టెంబర్ 23 నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 23 నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు
Uttarakhand assembly

డెహ్రాడూన్: సెప్టెంబర్ 23 నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 23,24,25 తేదీల్లో డెహ్రాడూన్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మదన్ కౌషిక్ తెలిపారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఆలస్యమైందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో కరోనా కేసుల సంఖ్య 11వేలకు చేరగా 140 మంది మరణించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/