జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు రాక

Monsoon
Monsoon

హైదరాబాద్‌: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ రెండోవారంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ డైరెక్టర్‌ వై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు దక్షిణ భూ మధ్యరేఖ మీదుగా ఉత్తరం వైపునుండి బంగాళాఖాతం వైపు గాలులు వీస్తున్నందున ఇంతవరకు మందగమనంలో ఉన్న రుతుపవనాల్లో కదలిక వచ్చిందని ఆయన చెప్పారు. అయితే రుతుపవనాలు ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి విస్తరించాయని, మరో రెండ్రోజుల్లో శ్రీలంకకు చేరుకుంటాయని పేర్కొన్నారు. అక్కడి నుండి రుతుపవనాలు జూన్‌ ఆరోతేదీ నుండి 10లోపు కేరళ తీరం చేరుతాయని, ఆ తర్వాత రెండు లేదా మూడ్రోజులకు తెలంగాణను తాకవచ్చని చెప్పారు. ఈ అంచనాలో రెండునుంచి నాలుగురోజుల తేడా రావొచ్చని పేర్కొన్నారు. ఈ సారి వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని, మిగతా ప్రాంతాల కంటే దక్షిణాదిలోనే కొంత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నదని అంచనావేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/