రానున్న 24 గంటల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో సాయంత్రం నుండి వాతావరణం మారిపోయింది. రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు, రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరింతగా నైరుతి రుతుపవనాలు విస్తరించడం, సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులతో వానలు పడనున్నట్లు వెల్లడించింది. ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం వానలు కురిశాయి. కర్నూలు, కడప, తిరుపతిలో వాన పడింది.