5,274 బృందాలతో కరోనా పరిస్థితుల పర్యవేక్షణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

5,274 బృందాలతో కరోనా పరిస్థితుల పర్యవేక్షణ
Monitoring of corona conditions_ TS CM Kcr

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 5,274 బృందాలు కరోనా పరిస్థితుల పర్యవేక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చినవారితోనే సమస్య ఉందన్నారు. 11వేల మందిని క్వారంటైన్‌కు తరలించామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 21 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.

రాష్ట్ర సరిహద్దుల్లో 54 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

78 జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కొందరు రైలు, రోడ్డు మార్గంలో రాష్ట్రంలోకి వచ్చారన్నారు. అనుమానితులను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/