‘మోజో’ టివి మాజీ సిఈఓ రేవతి అరెస్టు

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వెబ్ ఛానెల్ మోజో టివి మాజీ సిఈఓ రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇవాళ మణికొండలోని ఆమె ఇంటివద్ద రేవతిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కేసు విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఇంటికి వెళ్లి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆమె అరెస్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/