మాయిశ్చరైజ్‌ తప్పనిసరి

CUTE
CUTE

మాయిశ్చరైజ్‌ తప్పనిసరి

ప్రతిరోజూ శరీరం మొత్తాన్ని జెల్‌ లేదా ఆయిల్‌తో తప్పనిసరిగా మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. ముఖ్యంగా పొడిచర్మం కలవారు ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కనబరచకూడదు. డిటర్జంట్‌లు, ఎక్కువ గాఢత కల్గిన సబ్బులు వాడకుండా వీలైనంత వరకు సహజసిద్ధమైన వనరులతో తయారైనవి వాడితే మంచిది. అలాగే రాత్రి నిద్రపోయే ముందుకూడా క్రమం తప్పకుండా నైట్‌క్రీమ్‌తో ముఖం, శరీరం మొత్తం మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. కళ్ల చుట్టూ ఉండే చర్మాన్ని కూడా వదిలిపెట్టకూడదు. ఈ క్రమంలో చేతులు, పాదాల కోసం ప్రత్యేకమైన హ్యాండ్స్‌, నెయిల్‌ క్రీమ్‌ను వాడవచ్చు. ఎక్కువసేపు స్నానం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా వేడినీళ్ల స్నానమైతే మరింత కచ్చితంగా ఈ నియమం పాటించాలి. అలా షవర్ల కింద సమయం గడిపే సరదాకు కాస్త దూరం కావాలి. లేదంటే చర్మం మరింత పొడిబారిపోతుంది. స్నానం చేసే నీటిలో ఐదు చుక్కలు లావెండర్‌ ఆయిల్‌ను కలుపుకుంటే చాలా వరకు చర్మం పొడిబారకుండా చూస్తుంది. ముఖానికి అయితే.. పసుపు, బాదం పేస్ట్‌, పాలమీగడతో తయారైన ఫేస్‌ ప్యాక్‌ను వాడితే ముఖచర్మం చక్కని మెరుపును సంతరించుకుని ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బొప్పాయిపండు గుజ్జును ముఖం, చేతులు, పాదాలకు రాస్తే చర్మ సంరక్షణకు మంచిది. కళ్ల కింద చర్మాన్ని రోజూ కొబ్బరినూనెతో రెండునిమిషాల పాటు మసాజ్‌ చేస్తే కళ్లకింద నలుపు మటుమాయమవ్ఞతుంది. అంతేకాకుండా పెసరపిండి, పాలు, నిమ్మరసం, శనగపిండి, రోజ్‌వాటర్‌ తదితరాలతో క్రమం తప్పకుండా ప్యాక్‌లు పెట్టుకుంటే ముఖం తేటుగా, కోమలంగా ఉంటుంది. వారానికి ఒకసారి శరీరాన్ని బ్రష్‌తో బాగా రుద్దుకుని స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి, చర్మం తాజాగా ఉంటుంది. పెదాలకుబి పగిలిపోవడం, పొరలుగా ఏర్పడటం వంటి సమస్యలు పెదాలకు రాకుండా ఉండేందుకు నిద్రపోయే ముందు లిప్‌క్రీమ్‌తో మసాజ్‌ చేసుకోవాలి. లిప్‌స్టిక్‌ వేసుకున్న తరువాత వేజలిన్‌ రాసినా పెదాల చర్మాన్ని అది సంరక్షిస్తుంది. పెదాలు పగిలి నల్లగా ఉంటే ఒక చుక్క గ్లిజరిన్‌ వేలుమీద వేసుకొని పెదాలపై మసాజ్‌ చేస్తుంటే క్రమేణా పగుళ్లు తగ్గి గులాబీలాగా మారతాయి. పెదాలు నల్లగా ఉంటే పడుకోబోయే ముందు కొత్తిమీరను పేస్ట్‌గా చేసి పెదాలపై మసాజ్‌ చేస్తే నలుపుదనం పోతుంది. సన్‌స్క్రీన్‌ లోషన్‌ బయటకు వెళ్లడానికి అరగంట ముందే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటే రోజంతా సూర్యుని ప్రతాపం నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. చేతుల అందానికి ఒక స్పూన్‌ రోజ్‌వాటర్‌లో రెండు చుక్కలు గ్లిజరిన్‌ కలిపి స్నానం చేసిన తర్వాత చేతులకు మర్దనా చేసుకుంటే నలుపుపోయి నున్నగా మారడమే కాకుండా మృదువ్ఞగా కూడా తయారవ్ఞతాయి. శిరోజాలకు సంబంధించి అత్యధిక సమస్యలు తెచ్చిపెట్టే సమయం కూడా ఇదే. ఎక్కువగా కనిపించే సమస్య జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉండటం, చిట్లిపోవటం. వీటినుంచి బయటపడటానికి ముందుగా బాగా వేడిగా ఉన్న నీళ్లు స్నానానికి వాడకూ డదు. హెయిర్‌ డీప్‌ కండిష నింగ్‌ ట్రీట్‌ మెంట్‌ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ఎగ్‌ప్యాక్‌, హాట్‌ టవల్‌ ట్రీట్‌మెంట్‌లను ఉపయోగించుకోవచ్చు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా ముగింపు మాత్రం చల్లటి నీళ్లతో చేస్తే జుట్టుకే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది. రోజు విడిచి రోజు స్నానం చేసేటపుడు పాదాలను ప్రత్యేకంగా శుభ్రపరచుకునే అలవాటు చేసుకోవాలి. సాధారణంగా పాదాల వరకు వచ్చేసరికి అంత శ్రద్ధ చూపకపోవడమే వాటి అనారోగ్యానికి కారణం అని చర్మసంరక్షణ నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో చర్మం గిడసబారినట్టుగా జుట్టు కూడా బాగా పొడిబారుతుంది. దీనికోసం రోజూ మాడుకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల శిరోజాలు చక్కగా పెరగడం, శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడటం జరుగుతుంది. ఈవిధంగా మసాజ్‌ చేయడం వల్ల మెదడులో రక్తప్రసరణ మెరుగై తద్వారా చర్మం కూడా మృదువ్ఞగా తయారవ్ఞతుందని, కొబ్బరినూనె కొంచెం వెచ్చచేసి మర్దనా చేయడం వల్ల మరింత ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. శిరోజాలను ఈవిధంగా సంరక్షణ చేయడంతో పాటు చాలినంతగా నీరు త్రాగడం, తాజాపళ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల చక్కని తలకట్టు మీ సొంతమవుతుంది.