రెండో పెళ్లి విషయంలో మనోజ్ కు మోహన్ బాబు ఫస్ట్ చెప్పిన మాట ఇదేనట..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ..మనోజ్ రెండో పెళ్లి ఫై స్పందించారు. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అతి కొద్దీ మంది కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖుల మధ్య ఈ నెల 03 న వీరి వివాహం జరిగింది. కాగా వీరి పెళ్లి మోహన్ బాబు కు ఇష్టం లేదని , అందుకే పెళ్లి పనుల్లో ఎక్కడ కనిపించలేదని ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మనోజ్ పెళ్లి విషయంలో తనపై జరిగిన ప్రచారం ఫై స్పందించారు.

” మనోజ్ నా దగ్గరికి వచ్చి, డాడీ .. ఇదీ పరిస్థితి .. చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆలోచించారా అన్నాను .. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నాడు. అయితే అలాగే కానీ .. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను .. కాదని ఎందుకు అంటాను? . ఈ విషయంలో ఎవరో ఏదో రాశారనీ .. ఏదో అనుకుంటున్నారని ఆలోచించడం నాకు అలవాటు లేదు. వాడేం అనుకుంటున్నాడో .. వీడేం అనుకుంటున్నాడో అని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను. ఏనుగు వెళుతుంటే కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి .. మొరగనీ. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు? వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లాను” అంటూ చెప్పుకొచ్చారు.