భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఇంట విషాదం

భారత మాజీ కెప్టెన్, HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. అజారుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న అజీజుద్దీన్.. మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురై, మరణించారు. బుధువారం బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్ నమాజ్ ఇ జనాజా అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇక అజారుద్దీన్ విషయానికి వస్తే .. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్‌పై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. హెచ్‌సీఏలోని కొంత మంది సభ్యులతో అతనికి పడటం లేదు. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కి ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఆ సమయంలో టికెట్ల అమ్మకంపై పెద్ద దుమారమే రేగింది. దాంతో మరోసారి మహ్మద్ అజహరుద్దీన్ వార్తల్లో నిలిచాడు.