ప్రో కబడ్డీ వేలంలో అత్యధిక ధర పలికిన మహ్మద్‌ ఇస్మాయిల్‌…

PRO KABADDI
PRO KABADDI

హైదరాబాద్‌: ప్రో.కబడ్డీ లీగ్‌ (పికెఎల్‌) 7వ సీజన్‌ ఆటగాళ్ల వేలం సోమవారం నిర్వహించారు. మొత్తం 13దేశాలకు చెందిన 441మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. ఇందులో భారత్‌కు చెందిన ఆటగాళ్లు 388కాగా,విదేశీ ఆటగాళ్లు 53మంది ఉన్నారు. ఆటగాళ్ల వేలం కోసం ఒక్కో ఫ్రాంచైజీ రూ.4.4కోట్లు ఖర్చు పెట్టనున్నాయి. కాగా, ప్రో కబడ్డీ లీగ్‌ 7వ సీజన్‌ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 29మంది ఆటగాళ్లను తమవద్దే అట్టిపెట్టుకున్నాయి. పికెఎల్‌ 7వ సీజన్‌ కోసం జరిగిన వేలంలో తొలుత విదేశీ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈవేలంలో బెంగాల్‌ వారియర్స్‌ ఫ్రాంచైజీ అత్యధికంగా రూ.77.75లక్షలతో ఇరాన్‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ను కొనుగోలు చేసింది. సోమవారం నాటి వేలంలో మరో ఇరాన్‌ ఆటగాడు మొహజేర్‌ మాఘానిని తెలుగు టైటాన్స్‌ ఫ్రాంచైజీ అత్యధికంంఆ రూ.75లక్షలకు సొంతం చేసుకుంది. మూడుసార్లు పికెఎల్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌ యాజమాన్యం రూ.40లక్షలకు జాంగ్‌ కున్‌ లీని కొనుగోలు చేసింది. కున్‌ లీ గత సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌కు ఆడాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/