సర్దార్‌ పటేల్‌ ఆశయాలతోనే ముందుకెళ్తాం

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కరీంనగర్‌ ఎంపి బండి వల్లభాయ్‌  తో కలిసి అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌  పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అడుగుజాడల్లోనే మోడి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. పటేల్‌ కృషి వల్లే నిజాం కబంధహస్తాల్లో ఉన్న హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనమైందని గుర్తు చేశారు. సర్దార్‌ పటేల్‌ ఆశయాలతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/