‘పీపుల్స్ ప‌ద్మ’ కోసం నామినేట్ చేయండి

దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

PM Narendra Modi
PM Narendra Modi

New Delhi: ‘క్షేత్ర‌స్థాయిలో అసాధార‌ణ ప‌నులు చేస్తున్న వ్య‌క్తుల‌ను ప‌ద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్ర‌జల‌కు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మనదేశంలో క్షేత్ర‌స్థాయిలో అద్భుత‌మైన ప‌నులు చేస్తున్న నైపుణ్యం ఉన్న వ్య‌క్తులు ఎంతోమంది ఉన్నా.. వాళ్లు ఎవ‌రికీ తెలియ‌కుండా ఉండిపోతున్నారని ట్విట‌ర్‌లో ప్రధాని పేర్కొన్నారు. ‘స‌మాజంలో ఇలాంటి ఎంతో మంది వ్య‌క్తులను మ‌నం చూడమని ,, వారి గురించి వినటం అలాంటి వ్య‌క్తుల గురించి మీకు తెలుసా? వాళ్ల‌ను మీరు పీపుల్స్ ప‌ద్మ కోసం నామినేట్ చేయండి’ అని పేర్కొన్నారు. నామినేష‌న్లు సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కూ తెరిచే ఉంటాయన్నారు. http://padmaawards.gov.in లోకి వెళ్లి మీరు ఆ వ్య‌క్తుల‌ను నామినేట్ చేయ‌వ‌చ్చని మోదీ వివరించారు. .

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/