మోడి ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్

న్యూఢిల్లీ: ఈనెల 30 మోడి మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తమళ ఫీల్మీ స్టార్ రజనీకాంత్‌ను స్వీకారోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని రజనీకాంత్ స్వీకరించారు. ఈనేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుత దేశవ్యాప్తంగా మోడి వీస్తోందనిఅన్నారు. రాహుల్ గాంధీకి సానుభూతి తెలిపారు. పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేయకూడదని రజనీ అభిప్రాయపడ్డారు. మోడిది అసాధారణ విజయమని, ఆయన చరిస్మా ఉన్న నేత అని, భారత్‌లో నెహ్రూ, రాజీవ్ తర్వాత మోదీకి అంత చరిస్మా ఉందని రజనీ అన్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లనున్నట్లు చెప్పారు. రాహుల్ రాజీనామా చేయకూడదని, సమర్థుడినన్న విషయాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం బలంగా ఉండాలని రజనీ అభిప్రాయపడ్డారు.
తాజా క్రీడ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/