కరొనపై మోడీ వీడియో

అవగాహాన కల్పించండి

corona virus
corona virus

న్యూఢిల్లీ ; కరోనా… ఇపుడు ఈ పేరు వింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందో , ఎక్కడినుండి ఈ వైరస్ తమకు అంటుకుంటుందో అని ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ ఇప్పటికే 190 దేశాలకు విస్తరించి దాదాపు 11 వేలకు పైగా జనాలను బలిగొంది. అయితే ఇది ఇపుడు ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన భారతదేశంపై నెమ్మదిగా దాడికి దిగింది. ఇప్పటికే భారత్ లో 270 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. దీనితో భారత ప్రధాని ఈ నెల 22 న జనతా కార్ఫ్వుకు పిలుపునిచ్చాడు, ప్రతి ఒక్కరు జనతా కార్ఫ్వులో పాల్గొనాలని విజ్ఞప్తి చేసాడు. అయితే తాజాగా మోడీ సామజిక మాధ్యమాలలో వీక్షించిన ఒక వీడియోలొ ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందో చూసి దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అయితే ఎవరైనా సరే తమ వద్ద ఇలాంటి వీడియోలు ఉంటె వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రదర్శించి ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ దేశమంతా వ్యాపిస్తుందనే అంశంతో రూపొందించిన ఈ వీడియోను #IndiaFightsCorona అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసారు. ఆ వీడియో మీ కోసం….

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/andhra-pradesh/