స్టార్టప్‌ల అభివృద్ధికి ఆర్థిక చేయూత

కంపెనీల ప్రతినిధులతో ప్రధాని వీడియో సమావేశం

Modi video conference with representatives of startup companies
prime minister modi

New Delhi: దేశీయ స్టార్టప్‌లు దేశానికి వెన్నెముకగా ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. స్టార్టప్‌లకు మేలు చేసే విధంగా దేశంలో నియమాలను మార్చనున్నట్టు వెల్లడించారు.. స్టార్టప్‌ ప్రపంచంలో భారత పతకాన్ని ఎగురవేస్తున్న వారందరికీ మోడీ అభినందించారు. స్టార్టప్‌లకు సంబంధించి కేంద్రం మార్పులు చేస్తున్నదని మోడీ పేర్కొన్నారు. దేశంలోని స్టార్టప్‌లకు ఊతం ఇచ్చేందుకు ఆయన 150 స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఎంటర్‌ప్రైజ్‌ సిస్టమ్స్‌, స్పేస్‌, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్‌టెక్‌, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం లాంటి పలు రంగాలకు చెందిన 150కు పైగా స్టార్టప్‌ ప్రతినిధులతో మాట్లాడారు. స్టార్టప్‌ల అభివృద్ధి, ఆర్థికపరమైన చేయూత, ప్రభుత్వ సాయం, భవిష్యత్తు సాంకేతికత, ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడారు.

ఆధ్యాత్మికం సమాచారానికి: https://www.vaartha.com/specials/devotional/