నేడు సిఎంలతో ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్‌

లాక్‌డౌన్‌.. తదుపరి చర్యలపై అందరు ముఖ్యమంత్రులనూ సలహా కోరనున్న మోడి

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యలో దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌2.0 మే 3తో ముగియనున్నది. దీంతో లాక్‌డౌన్‌ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నేడు ప్రధాని మోడి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ ప్రారంభం కానుండగా, ప్రధాని అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయి, కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయిన వేళ, ఆర్థిక వృద్ధి పాతాళానికి పతనం కాగా, దాన్ని తిరిగి నిలిపేలా కొన్ని కీలక నిర్ణయాలను ఈసారి మోడి ప్రకటిస్తూ, లాక్ డౌన్ నుంచి ఉపశమనాన్ని కలిగించవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో సిఎం ల సలహాలను తొలుత అడిగి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్న మోడి, ఆపై మొత్తం పరిస్థితిని సమీక్షించి, లాక్ డౌన్ ను పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? అన్న విషయమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/