ఇజ్రాయెల్‌లో ఎన్నికలు..ట్రంప్‌, మోడి, పుతిన్‌ల మద్దతు

పెద్ద పెద్ద భవంతులపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు

Netanyahu,Modi ,Trump,Putin
Netanyahu,Modi ,Trump,Putin

జెరూసలెం: కొద్ది రోజుల్లో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ప్రచార హోరు ప్రారంభమైంది. అయితే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతన్యాహూకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం అంటే వారు నేరుగా అక్కడ ప్రచారం చేయడం లేదు. నెతన్యాహూతో ట్రంప్, పుతిన్, మోడి తీసుకున్న ఫొటోలకు సంబంధించిన ఫ్లెక్సీలు జెరూసలెం వీధుల్లో దర్శనం ఇస్తున్నాయి. పెద్ద పెద్ద భవంతులపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ జాతీయ ఎన్నికలు సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఆయన సారధ్యం వహిస్తున్న లుకిడ్ పార్టీ (లుకిడ్ నేషనల్ లిబరల్ మూమెంట్) ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, ఇజ్రాయెల్ ఎన్నికలకు ఎనిమిది రోజుల ముందు అంటే సెప్టెంబర్ 9న మోదీని నేతన్యాహూ కలవనున్నారు. ఇండియాకు వచ్చి స్వయంగా మోదీని కలిసి అనంతరం ఇజ్రాయెల్ వెళ్తారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/