కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని పూజలు

అభివృద్ధి పనుల ప్రారంభం

Modi worships at Kedarnath temple
Modi worships at Kedarnath temple

Kedarnath:  ప్రధాని నరేంద్ర మోడీ కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆల‌యంలో ప్రార్థన‌లు నిర్వహించిన త‌ర్వాత ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ తర్వాత మళ్లీ నిర్మించారు. సరస్వతి ఘాట్ తో పాటు రూ. 130 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన‌ ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులను  ప్రధాని ప్రారంభించారు. 

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/