జార్ఖండ్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం

modi
modi

జార్ఖండ్ :  ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. హజారీ బాగ్, దుంకా, పాలమావు, జంషెడ్ పూర్లో 500 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. హజారీ బాగ్ లో నాలుగు పట్టణ మంచినీటి పథకాలకు, రామ్ ఘర్ లో రెండు గ్రామీణ మంచి నీటి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. హజారీ బాగ్ లో కొత్తగా నిర్మించిన మహిళా ఇంజినీరింగ్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. గిరిజన ప్రాంతాల కోసం నిర్మిస్తున్న మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. హజారీ బాగ్ లోని ఆచార్య వినోబా భావే విశ్వవిద్యాలయంలో ట్రైబల్ స్టడీస్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.