హోలీ వేడుకలకు ప్రధాని మోడి దూరం

కోవిడ్‌ 19 వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దు

pm modi
pm modi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) భారత్‌లో వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోడి హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మోడి ట్విట్టర్‌లో తెలిపారు. ‘కరోనా వైరస్ అయిన కోవిడ్‌ 19 వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దని ప్రపంచ వ్యాప్త నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఈ ఏడాది హోలీ వేడుకలకు దూరంగా ఉంటాను’ అని ప్రకటించారు. కాగా, కరోనా నియంత్రణ కోసం కరచాలనం, కౌగిలింతలు వంటివి మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జనాలతో క్లోజ్‌గా తిరగవద్దని చెబుతున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌తో పాటు జనసంచారం అధికంగా ఉండే చోట్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/