ప్రధాని మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

pm modi

బిజెపి పార్టీ..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా కమలం జెండా ఎగురవేయాలని చూస్తుంది. దీనికి తగ్గట్లే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో వచ్చే నెలలో ప్రధాని మోడీ తో పాటు నేతలు హైదరాబాద్ కు రాబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను బిజెపి అధిష్టానం విడుదల చేసింది.

జులై 1న మధ్యాహ్నం 3 గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌లో కిలోమీటరు దూరం నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు. జులై 2న ప్రధాని మోడీ హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు.