బిజెపిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

Modi's mother Heeraben Modi
Modi’s mother Heeraben Modi

గాంధీనగర్‌: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధిక్యంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మోడి తల్లి హీరాబెన్‌ నివాసం ఎదుట భారీ సంఖ్యలో బిజెపి శ్రేణులు, అభిమానులు చేరారు. వీరిని పలకరించేందుకు హీరాబెన్‌ ఇంటి నుంచి బయటికి వచ్చారు. అందరికీ అభివాదం చేసి, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. మోడి మరోసారి వారణాసి నుంచి పోటీ చేశారు. అక్కడ బిజెపి ఆధిక్యంలో దూసుకుపోతోంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/