అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడి

PM Narendra Modi visits residence ofArun Jaitley
PM Narendra Modi visits residence ofArun Jaitley

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్‌ నాయకుడు అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోడి ఈరోజు పరామర్శించారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్‌లను ప్రధాని ఓదార్చారు. విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున దిల్లీ చేరుకున్న మోడి .. ఈ ఉదయం జైట్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే జైట్లీ ఇంటివద్ద ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మోడి ని వెంట తీసుకెళ్లారు.
కాగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స పొందుతూ గత శనివారం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మోడి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటనలో ఉన్నారు. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబసభ్యులతో మోడి ఫోన్లో పరామర్శించారు. అయితే ఈ కారణంగా విదేశీ పర్యటన అర్ధంతరంగా రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీని కోరారు. దీంతో మోడి తన పర్యటనను కొనసాగించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/