క్రమశిక్షణ అంటేే నియంతృత్వ పోకడగా ముద్రవేస్తున్నారు

Modi, Mannohan, Venkaiah
Modi, Mannohan, Venkaiah

క్రమశిక్షణ అంటేే నియంతృత్వ పోకడగా ముద్రవేస్తున్నారు

న్యూఢిల్లీ: క్రమశిక్షణతో నడుచుకోవాలని హితవు చెప్పడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నియంతృత్వధోరణులుగా ముద్రపడుతోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నాయకుడుగా రాజ్యసభ ఛైర్మన్‌ ముప్పవరపు వెంకయ్యనాయుడు నిలు స్తారని ఆయన ప్రశంసించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా మొదటి ఏడాది అనుభవాలను క్రోడీకరించి రచించిన పుస్తకాన్ని మోడీ ఆదివారం ఆవిష్కరించారు. దూరదృష్టితోకూడిన నాయకత్వ లక్షణాలు ఆయన సొంతమని, అందువల్లనే ఆయన అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని అన్నారు. వెంకయ్యజీ అత్యంత క్రమశిక్షణతో నడిచే నాయ కుడని, అయితే నేడు దేశంలో క్రమశిక్షణ అనేది అప్రజాస్వామికంగా మారుతోందని ఆయన అన్నారు.

ఎవ్వరైనా క్రమశిక్షణ పేరును ఉదహరించినా నియంత్రృత్వ పోకడలుగా ముద్రపడుతున్నదని అన్నారు. ఎలాంటి బాద్యతలు నాయుడికి అప్ప గించినా అత్యంత క్రమశిక్షణతోను, చిత్తశుద్దితోను ఎంతో సులువుగా నెరవేర్చేనాయకుడని కొనియా డారు. 50 ఏళ్లుగా ఆయన ప్రజాజీవితంలో కొనసా గారని, పదేళ్లు విద్యార్ధి రాజకీయాల్లో ఉంటే 40 ఏళ్లు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి రాజకీయాల్లో నడిచారని ప్రధానిపేర్కొన్నారు. 245పేజీలున్న ఈ పుస్తకానికి వెళ్లేముందు మరింత ముందుకు అన్న శీర్షికన ఆఫీసులో తొలి ఏడాది అన్న శీర్షికతో వెలువడింది. ఈ ఏడాది కాలంలో వెంకయ్య నాయుడు తన అనుభవాలను ఈ పుస్తకంలో క్రోడీకరించారని అన్నారు.

గత ఏడాది ఆగస్టు 11వ తేదీ ప్రమాణస్వీకారంచేసిన తర్వాత దేశవ్యాప్తంగా తాను నిర్వహించిన పర్యటనల్లో నాలుగు కీలక అంశాలుగోచరించాయని అన్నారు. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నాయుడికి తన ప్రభుత్వంలో మంత్రిపదవి ఇవ్వాలని చూసారని, అయితే తనకు గ్రామీణాభివృద్ధి మంత్రి కావాలనుకుంటున్నట్లు నాయుడు చెప్పారని గుర్తుచేసారు. రైతుబిడ్డ వెంకయ్యనాయుడు అని రైతు సంక్షేమానికి, వ్యవసాయానికి ఆయన ఎంతో ప్రాధాన్యతనిస్తారన్నారు. నాయుడుకృషివల్లనే నేడు దేశంలోప్రధాన్‌ మంత్రి గ్రామ్‌సడక్‌యోజన కొనసాగుతోందని, కేవలం రైళ్ల హాల్ట్‌లపై మాత్రమే చర్చలుజరిగే రోజుల్లో వెంకయ్యనాయుడు నాయ కులు ప్రజాప్రతినిధుల్లో అవగాహనపెంచి రోడ్లు మౌలికవనరులు పెంపుదలపైదృష్టిపెట్టాలని సూచిం చారని అన్నారు.

భారత్‌లో రోడ్డు కనెక్టివిటీ పెరిగితే అభివృద్ధి పెరుగుతున్నదని చెప్పిన నేత వెంకయ్య నాయుడేనని అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, మాజీ ప్రధానమంత్రులు మన్‌మోహన్‌సింగ్‌, హెచ్‌డి దేవేగౌడ, ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆనంద్‌శర్మలు వేదికపై ఉన్నారు.