నేడు తెలుగు రాష్ట్రాల్లో మోడి సభలు

PM Modi
PM Modi

కర్నూలు: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు కర్నూలులో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌కు మధ్యాహ్నం 2.20 గంటలకుచేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగించుకొని సాయంత్రం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే సభా ప్రాంగణానికి వెళతారు. సాయంత్రం 4.30 నుంచి 5.15గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఏపీఎస్పీ మైదానం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని విమానంలో ఢిల్లీ కి బయలుదేరివెళ్తారు.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/