మోదీ చౌకీదార్‌ ఉద్యోగానికి కూడా పనికిరాడు: రేణుకా చౌదరి

renuka chowdhury
renuka chowdhury

ఖమ్మం : నేడు బుధవారం మీడియాతో రేణుకా చౌదరి మాట్లాడుతూ ,కెసిఆర్‌ ను ఎదుర్కోవడానికి తానొక్కదానిని చాలు అని రేణుకా చౌదరి అన్నారు కెసిఆర్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలు తెరిచారని విమర్శించారు. ఖమ్మం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరావును చూస్తుంటే జాలేస్తోందన్నారు. పార్టీ మారేందుకు నామాకు రెండే మార్గాలు ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపైనా రేణుకు చౌదరి విరుచుకుపడ్డారు. మోదీ చౌకీదార్ ఉద్యోగానికి కూడా పనికిరారని విమర్శించారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/