తల్లి మృతితో బాధలో ఉన్న సరే..షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శ్రీకారం

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బదపడుతున్న ఈమె..ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొద్దీ సేపటి క్రితమే గాంధీనగర్‌లో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం..కుటుంబ సభ్యులంతా తుది వీడ్కోలు పలికారు. మోడీతో పాటు ఆయన సోదరులు హీరాబెన్ చితికి నిప్పంటించారు. తల్లి మరణంతో పుట్టెడు బాధలో ఉన్న మోడీ..ఆ బాధలోనే ఈరోజు షెడ్యూల్‌ ప్రకారం పశ్చిమబెంగాల్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను జరపనున్నట్లు అధికారులు ట్వీట్ చేసారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.7800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ ప్రారంభిస్తారని పీఎంఓ ట్వీట్‌ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుండి న్యూ జలపాయిగురి జంక్షన్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు.

అలాగే కోల్‌కతా మెట్రో యొక్క పర్పుల్ లైన్ జోకా-తరటాలా స్ట్రెచ్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. బహుళ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. వివిధ రైల్వే ప్రాజెక్టులతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. 990 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద అభివృద్ధి చేసిన 7 సీవరేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు.