రాష్ట్రాల సిఎంలకు ప్రధాని ఫోన్‌

ముఖ్యమంత్రులతో నేరుగా మాట్లాడిన మోడి

modi
modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి కశ్మీర్‌ అంశంపై తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్రాల సిఎంలకు స్వయంగా ఫోన్‌ చేసి తెలియజేశారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి కశ్మీర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో కశ్మీర్‌ లోయకు బలగాల మోహరింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/