కరోనా నియంత్రణ, తుపాను స‌హాయ‌క చ‌ర్య‌లకు సెల్యూట్

‘మ‌న్ కీ బాత్‌’లో ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi
PM Narendra Modi

New Delhi: ప్రస్తుతం దేశంలో కరోనా, తుపాను ప‌రిస్థితులు, స‌హాయ‌క చ‌ర్య‌లపై ఆదివారం ‘మ‌న్ కీ బాత్‌’లో ప్ర‌ధాని మోదీ ప్రస్తావించారు. వందేళ్ల‌లో చూడ‌ని విప‌త్తులు ఎదుర్కొంటున్నామని, క‌రోనా, తుపాను బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నామని చేప్పారు. తుపాను నేప‌థ్యంలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొని ల‌క్ష‌లాది మందికి సేవ‌లు అందించిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నాన‌ని, వారి సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని ప్రధాని అన్నారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారని, . కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్రాలు కలిసి పని చేశాయని తెలిపారు. తక్కువ ప్రాణనష్టం జరిగిందని, ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నానని మోడీ పేర్కొన్నారు.

ఇక కరోనా నియంత్రణ చర్యల గురించి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో వైద్య ఆక్సిజన్ సరఫరా చేయటం క‌ష్టంగా మారిందని , ట్యాంకర్ డ్రైవర్ల శ్రమ ద్వారా లక్షల మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారని అన్నారు. నేడు ఆక్సిజన్ ఉత్పత్తి దాదాపు 9,500 మెట్రిక్ టన్నులు పెరిగిందని ప్ర‌ధాని వెల్లడించారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/