నరేంద్రమోడిని కొనియాడిన శివసేన

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi

ముంబయి: ప్రధాని నరేంద్రమోడిని శివసేన ప్రశంసలు కురిపించింది. తాజాగా మిషన్ శక్తిని భారత్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలోతన పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో మోడిని పొగుడుతూ వ్యాసం రాసింది. మోడి హే తో ముమ్కిన్ హై (మోదీ ఉంటే సాధ్యమే) అంటూ ఈ మిషన్‌ను కొనియాడింది. ఇదో అరుదైన ఘనత అని, దీని కారణంగా ఇండియా స్పేస్ సూపర్ పవర్‌గా మారిందని సామ్నా అభిప్రాయపడింది. నిన్నటి వరకు ఇండియా ఓ అణు శక్తి. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ నుంచి వాజ్‌పేయి వరకు దీనికోసం తీవ్రంగా శ్రమించారు. అయితే మోడి హయాంలో మాత్రం ఇండియా స్పేస్ సూపర్ పవర్‌గా ఎదిగింది. ఇదంతా మన సైంటిస్టుల కృషి ఫలితమే అని సామ్నా స్పష్టం చేసింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/