దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధానికి అవగాహన లేదు

దేశంలోకి వచ్చే పెట్టుబడులు నిలిచిపోయాయి

Rahul
Rahul

జైపూర్‌్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజస్థాన్‌ రాజధాని జైపూర్ లో జరిగిన ‘యువ ఆక్రోశ్ ర్యాలీ’లో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ఆర్థికవృద్ధిరేటు యూపీయే పాలనలో నమోదైన దానికంటే తక్కువగా ఉందని విమర్శిస్తు.. మోడి ప్రభుత్వం పాలన తీరుపై ధ్వజమెత్తారు. ప్రధాని మోడికి దేశ ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేదని వ్యాఖ్యానించారు. యువతను దేశ సంపదగా పేర్కొంటూ.. ప్రస్తుతం ఆ సంపద దుర్వినియోగమవుతోందని రాహుల్ చెప్పారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడి ప్రభుత్వం.. తమ విధానాలతో పరిస్థితిని దిగజార్చిందన్నారు. గత ఏడాది కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. ఇప్పటివరకు భారత్ శాంతి కాముక దేశంగా పేరు గడించిందని.. ఆ పేరు ప్రతిష్ఠను మోడి సర్కారు దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఫలితంగా దేశంలోకి వచ్చే పెట్టుబడులు నిలిచిపోవడానికి కారణమయ్యారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/