ఐపిఒ మార్కెట్‌కు మోడీ సర్కారు వెన్నుదన్ను!

ఐపిఒ మార్కెట్‌కు మోడీ సర్కారు వెన్నుదన్ను!

ముంబయి: అనూహ్యమెజార్టీతో నరేంద్రమోడీ ఎన్‌డిఎ కూటమి మళ్లీ పగ్గాలు చేపట్టడంతో మార్కెట్లలో నిధుల సమీకరణ లావాదేవీలు భారీ ఎత్తున పెరుగుతాయని ఆర్ధికనిపుణులు అంచనావేస్తున్నారు. ఐపిఒ వంటి క్ర్రియలకు ఇపై భారీ ర్యాలీ ఉంటుందని చెపుతున్నారు. సంస్థాగత అర్హులైన ప్లేస్‌మెట్‌ వంటి విధానాల్లో ఈ మూడు త్రైమాసికాల్లో కార్యకలాపాల్లో రికవరీ ఉంటుందని చెపుతున్నారు. మార్చినెలాఖరువరకూ చూస్తే మ్తొం 59 కంపెనీలు 53 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ఐపిఒలకు దరఖాస్తుచేసాయి. ప్రైమ్‌ డేటా బేస్‌ కథనాలను చూస్తే ఐపిఒ మార్కెట్‌భారీ స్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు కనిపిస్తోంది. కంపెనీలు ఇప్పటికే ఈ డీల్స్‌కోసం సంప్రదింపులుప్రారంభించాయి. జులైనుంచి ఐపిఒ కార్యకలాపాల్లో మంచి ఊపు ఉంటుందని ముంబయి కేంద్రంగా ఉన్న ఇన్వెష్‌మటెంట్‌ బ్యాంక్‌ ఈక్వేరియస్‌ క్యాపిటల్‌ సంస్థ ఎండి మునీష్‌ అగర్‌వాల్‌పేర్కొన్నారు. ఇప్పటివరకూ స్థిరమైన ప్రభుత్వం వస్తుందా లేక సంకీర్ణ ఏర్పడుడుతందా అన్న అనిశ్చితి తొలగిపోవడంతో మార్కెట్లకు ఐపిఒల రాక పెరుగుతుందని అంచనా. ఇప్పటివరకూ కేవలం ఏడు సంస్థలు ఆత్రమే 5033 కోట్ల నిధులు ఐపిఒలద్వారా సమీకరించాయి. అంతకుముందు ఏడాది అయితే 24 కంపెనీలు 30,959 కోట్లు సమీకరించాయి. ఐపిఒ ఆధారిత కంపెనీలు సెబీ అనుమతిసాధించినప్పటికీ కొంతమేర సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అన్న మీమాంసతో ఇప్పటివరకూ మార్కెట్లకు రాలేదు. ఇపుడు ఆ అనిశ్చితి కాస్తా తొలగిపోవడంతో మార్కెట్లకు నిధులసమీకరణ లావాదేవీలుపెరుగుతాయని ఎల్‌అండ్‌ఎల్‌ పార్టనర్స్‌ భాగస్వామి రవిదూబే పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/