రైతన్నలకు తీపి కబురు : పీఎం కిసాన్ అమౌంట్ పెంచే ఆలోచనలలో మోడీ ప్రభుత్వం

రైతులకు మోడీ ప్రభుత్వం తీపి కబురు తెలుపబోతుంది. దేశంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో దేశంలోని రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేయటానికి అవసరమైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారని వినికిడి.

రైతులకు అందుతున్న మెుత్తాన్ని పెంచాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నప్పటికీ దానిపై వాయిదాల పర్వం నడిచింది. ఇప్పటి వరకు కేంద్రం రైతులకు ఏడాదికి పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6000 చెల్లిస్తోంది. అయితే ఈ మెుత్తాన్ని రూ.2000 పెంచి రూ.8000 కు చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే ఏడాదికి నాలుగు విడతలుగా ఈ మెుత్తాన్ని రూ.2000 చొప్పున చెల్లించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది అమలులోకి వస్తే ఏడాదికి మూడు సార్లకు బదులుగా నగదు నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా దేశంలోని రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మెుత్తం 12 విడతలు డబ్బును జమ చేసింది. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 13వ విడత డబ్బు చేరే అవకాశం ఉంది.