తెలంగాణ నుండి ఏపికి వెళ్లాలనుకునే వారికి శుభవార్త

గతంలో ఐదేళ్ల గడువును పెట్టిన కేంద్రం
ఇప్పుడు మరో రెండేళ్ల పొడిగింపు

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించినా, వెళ్లలేకపోయిన వారికి కేంద్ర సర్కారు శుభవార్తను చెప్పింది. ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది. ఇటీవల జగన్ న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసినప్పుడు గడువును పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జగన్ కోరిక మేరకు మోదీ స్వయంగా హోమ్ శాఖకు స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/