ఆరెస్సెస్ విధానాలను మోడి అనుసరించడం లేదు

Priyanka Gandhi
Priyanka Gandhi

న్యూఢిల్లీ: ఆరెస్సెస్ అభిప్రాయాల పట్ల ప్రధాని మోడి కి గౌరవం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ… సున్నితమైన అంశాలపై అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనేది మోహన్ భగవత్ అభిప్రాయమని చెప్పారు. ఆరెస్సెస్ విధాలను మోడి అనుసరించడం లేదని అన్నారు. జమ్ముకశ్మీర్ విషయంలో కూడా మోడి ఏకపక్ష నిర్ణయాలనే తీసుకున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. జమ్ముకశ్మీర్ అంశాన్ని బీజేపీ పెద్ద సమస్యగా భావించకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/