మోది మూడు రోజులు ప్రచారం చేయొద్దు
ఎన్నికల సంఘాన్ని కోరిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందువల్ల ఆయన మూడు రోజుల పాటు ప్రచారం మానేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్‌ను కోరింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నందున మోదిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది.
బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఎన్నికల ప్రచారంలో తరుచూ ప్రస్తావిస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనే. మోదిపై కనీసం రెండు లేదా మూడు రోజుల నిషేధం విధించాలని ఎన్నికల కమీషన్‌ను కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/