మన్మోహన్‌సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోడి

Manmohan Singh – Narendra Modi

న్యూఢిల్లీ: నేడు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పుట్టినరోజు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడి మ‌న్మోహ‌న్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. చిర‌కాలం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. ఈమేర‌కు ప్ర‌ధాని మోడి ట్వీట్ చేశారు. కాగా దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు బీజం పోసిన మ‌న్మోహ‌న్ సింగ్‌.. 2004 నుంచి 2014 వ‌ర‌కు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. దీంతో అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ప‌నిచేసిన‌ గాంధీ, నెహ్రూ కుంటుంబేత‌ర కాంగ్రెస్ నేత‌గా నిలిచారు. కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక స‌ల‌హాదారుగా 1971లో నియ‌మితుల‌య్యారు. అనంత‌రం మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్య‌లు చేప‌ట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/