బండి సంజయ్ భుజం తట్టి ఖుషి చేసిన మోడీ

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బిజెపి ప్రజా సంకల్ప సభ జరిగింది. ఈ సభకు లక్షల్లో కార్యకర్తలు రావడంతో మోడీ ఆశ్చర్యపోయారు. మోడీ వేదికపైకి ఎంట్రీ ఇస్తున్న టైంలో సభ మోడీ నినాదాలతో హోరెత్తింది. ఆ హోరుకు మోడీ కూడా ఫిదా అయ్యాడు. చిరునవ్వులు చిందించాడు. వారెవ్వా అంటూ బండి సంజయ్ భుజం తట్టాడు.

విజయ సంకల్ప సభ వేదికపైకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ.. స్టేజంతా కలియదిరుగుతూ ప్రజలందరికీ అభివాదం చేశారు. వేదికపై ఉన్న నేతలను కూడా పలకరించారు. తరువాత ఆయన సీట్లో కూర్చున్న తరువాత సభకు వచ్చిన జనాన్ని కాసేపు చూశారు. దీంతో ఆయన ఫుల్ ఖుషీ అయినట్లు అర్థమవుతోంది. వెంటనే తన పక్కన కూర్చున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైపు తిరిగి జనం భారీ సంఖ్య లో హాజరయ్యారని అన్నట్లు సంజయ్ భుజం తట్టాడు. జనసమీకరణ భారీగా జరిపావు. వెరీ గుడ్ జనం చాలామంది వచ్చారు అని అన్నట్టుగా చెప్పినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగులో ప్రసంగించి.. నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. బండి సంజయ్ కూడా మోడీ దేవుడు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదర, సోదరీమణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం. మీ ప్రేమ నాకు అర్థం అవుతోంది..తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..రాష్ట్రం మొత్తం ఈ మైదానంలో కూర్చునట్లు ఉంది.ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుట్టినిల్లు. భద్రాద్రి సీతారాముడి నుంచి యాదాద్రి నరసింహస్వామి దాకా.. ఆలంపూర్ జోగుళాంబ నుంచి వరంగల్ లోని భద్రకాళి దాకా అందరి దీవెనలు దేశంపై ఉన్నాయి. రామప్ప నుంచి కాకతీయ తోరణం దాకా తెలంగాణ ఆర్కిటెక్చర్ దేశానికే గర్వకారణం’’ అని మోడీ అన్నారు.