డీఎస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మరణించారు, హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డీఎస్‌ మృతి చెందారు. డీఎస్‌ పార్థివ దేహాన్ని శనివారం సాయంత్రం నిజామాబాద్ కు తరలించారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపబోతున్నారు.

ఇక శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆయన మరణం ఎంతగానో బాధను కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఎక్స్ వేధికగా మోదీ సానుభూతి తెలిపారు.