శుష్కవాగ్దానాలు,శూన్య హస్తాలు

Modi Cabinet
Modi Cabinet (File)

శుష్కవాగ్దానాలు,శూన్య హస్తాలు

కేంద్రంలో ఏన్డీయే ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా, ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాల వలన కార్మికులు, ప్రజలు అనేక అష్టకష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్నారు. 200 సంవత్సరాల రవి అస్తమించని బ్రిటిష్‌ పాలనపై పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం, కార్మిక హక్కుల్ని, స్వాతంత్య్రాన్ని హరించి వేస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా చేస్తు న్నారు.

”మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్న చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలలో భాగంగా 45 కార్మిక చట్టాలు ఎఐటియుసి నాయకత్వాన పోరాడి సాధిస్తే చట్టాలను 5 కోడ్‌లుగా మార్చి సులభతరం చేస్తానని చెప్పి కార్మిక వ్యతిరేక విధానాలతో కష్టాలపాలు చేస్తున్నారు. యాజమాన్యాలకు, పెట్టుబడి దారు లకు మేలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టాన్ని మారుస్తూ, భవిష్యత్‌లో పర్మనెంట్‌ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకుండా హైర్‌ అండ్‌ ఫైర్‌ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లా§్‌ుమెంట్‌ అనే విధానం ద్వారా శాశ్వత ఉద్యోగులు లేకుండా ప్రభుత్వా లు చర్యలు చేపడుతున్నాయి. కాంట్రాక్టు యాక్టును మార్చి కార్మికులను ఎప్పుడైనా తొలగించే హక్కును కాంట్రాక్టరుకు, యాజమాన్యాలకు ఇచ్చి ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు.

యూనియన్‌, యాజమాన్యం కార్మికుల వేతన పెంపుదలపై చర్చించేప్పుడు సమర్థత అనే అంశాన్ని ముందుకు తెచ్చి యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై కార్మికుల వేతనాలు ఇతర సౌకర్యాలు పొందే విధానాన్ని తీసుకువస్తున్నది. కార్మికులు వారి హక్కులు సాధించటానికి సమ్మె చేయాలంటే అనేక నిబంధనలు పెట్టి, సమ్మె పేరుతో నాయకులనుతొలగించ టం, జైలుకు పంపటం, జరిమాన విధించటం- అనే అంశా లతో ఐ.డి. యాక్టులో మార్పులు తెచ్చి కార్మికుల, ఉద్యమా లపై ఉక్కుపాదం మోపుతుంది. అప్రెంటిస్‌ ఒక సంవత్సరం బదులు ఐదేళ్లకు పెంచి తక్కువ స్టైఫండ్‌తో శ్రమ దోపిడికై యాజమాన్యాలకు మోడీ ప్రభుత్వం ఊతంఇస్తున్నది.

26 అక్టోబర్‌, 2016న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ”సమా న పనికి సమాన వేతనం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం యాక్ట్‌ 1976 ప్రకారం ఆదేశిస్తే అమలు చేయటం లేదు. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు నెలకు 18 వేలు కనీస వేతనం చెల్లించాలన్న డిమాండ్‌ను పట్టించుకో వటం లేదు. మొత్తం కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీ చేస్తూనే దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నానని మోడీ ప్రగల్భాలు పలుకు తున్నారు. రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధిస్తామం టూ మోసం చేస్తున్నారు.

అసంఘటిత కార్మికులకు సంక్షేమ చట్టం తెచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని లక్షలాది కార్మికులు ఢిల్లీలో ప్రదర్శన చేసినా వారి డిమాండ్స్‌పై మాట్లాడటానికి మోడీకి సమయం ఉండదు. కానీ పారిశ్రామిక అధిపతులకు, వ్యాపారవేత్తలతో కలవటానికి, విదేశీ పర్యట నలకు వెళ్లేందుకు ఎప్పుడైనా సమయం ఉంటుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి ముందు సంవత్సరానికి కోటి ఉద్యో గాలు ఇస్తానని వాగ్దానం చేసి నాలుగున్నర సంవత్సరాలు గడిచింది. లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వక, ఉన్న ఉద్యోగాలే 5 లక్షలు ఊడిపోయాయి. నోట్ల మార్పిడి, జీఎస్టీల వల్ల లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లలో కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.

లక్షలాదిగా ఉన్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటం లేదు. వారికి ప్రతి నెల జీతాలు కూడా రాని పరిస్థితి. గ్రామీణ ఉపాధిహామీ పథకానికి 2018-19 కేంద్ర బడ్జెట్‌లో సగానికి సగం కోత, వైద్య, విద్యారంగాలకు బడ్జెట్‌ కోత, రిటైల్‌ వ్యాపారంతో పాటు కీలక రంగాలైన రైల్వే, బ్యాంక్‌, రక్షణ, ఎల్‌ఐసి లాంటి సంస్థలలో విదేశీ పెట్టుబడులు 100 శాతం అనుమతి ఇచ్చి బ్రిటిష్‌ పాలనను గుర్తు చేస్తున్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగనామం పెట్టి రాజకీయాలలో, వ్యాపారంలో పెద్ద మనుషు లుగా చెలామణి అవుతున్నవారి పేర్లు బహిర్గతంచేయకుండా, దొంగలకు అండగా ఉంటూ మరోవైపు పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు సబ్సిడి ఇస్తూ, సామాన్య ప్రజలపై పన్నులపై పన్నులు వేస్తున్నది. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదం తో ఎన్నికల్లో గెలిచి, అంబానీ అదానీల వికాస్‌ కోసం పాటు బడుతూ అభివద్ధి అంటే దేశంలో బిలీనియర్లు పెరగటం అని మోడీ కొత్త పాఠాలు చెబుతున్నారు.

దేశ సంపద 22 మంది చేతిలో 80 శాతం సంపద ఉండగా, 78 శాతం ప్రజల చేతిలో 20 శాతం సంపద ఉందంటే, ఉన్నోడు మరింత ఉన్నోడిగా సంపద పెరుగుతుంటే, లేనోడు మరింత లేనోడై పేదరికంలో మగ్గుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ పాలన మోడీ పాలనకన్నా భిన్నంగా లేదు. ఎన్నికల ముందు కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని అధికారంలోకి వచ్చి, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయకపోగా అన్ని సంస్థలలో మూడు వంతులు కాంట్రాక్టు కార్మికులను పెంచారు.

రాష్ట్రంలో కనీస వేతనాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. కానీ గత 15 సంవత్సరాల నుండి యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి కార్మికుల శ్రమను దోచుకోవటానికి ప్రభుత్వం తోడ్పడుతున్నది. కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు రాష్ట్రంలో డాII అక్రాడ్‌ ఫార్ములా ప్రకారం కనీస వేతనం రూ.15,400/-లు ఇవ్వాల ని రెండు సంవత్సరాల ముందు రికమండ్‌ చేస్తే ఈ రోజుకు జి.ఒ విడుదల చేయలేదు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవాటిని నింపకుండా అన్ని డిపార్టు మెంటులలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిని కొనసాగిస్తు న్నారు. ప్రజా ప్రతినిధుల జీతాలు రెండింతలు పెంచుకున్నా రు.

తెలంగాణ రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలు సిసిఐ ఆదిలాబాద్‌, వరంగల్‌లో బిల్డ్‌ పరిశ్రమ, అజంజాహీ మిల్లు, నిజాం షుగర్‌ ప్యాక్టరీలు మొదలయిన వాటిని తెరిపి స్తానని చేసిన వాగ్దానం నెరవేర్చలేదు. కాజీపేట రైల్వే కోచ్‌ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించు కోలేదు. బీడీ పరిశ్రమలో లక్షలాది కార్మికుల జీవితాలు దుర్భరమైనాయి. నష్టాల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారు. యూనియన్‌ ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు కారుణ్య నియామ కాలు మొదలయినవి ఈ రోజుకు పరిష్కరించలేదు.
రాష్ట్రంలో మెడికల్‌, మున్సిపల్‌ పర్యాటక రంగం, హమాలీ, అంగన ్‌వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం ఇతర స్కీం వర్కర్ల అందరికి కననీస వేతనాలు సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం సంస్థలలో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, సెలవులు అమలు చేయటం లేదు. ్ద (రచయిత:ఎఐటియుసి తెలంగాణ రాష్ట్రసమితి) సలవులు అమలు చేయటం లేదు.

– ఉజ్జిని రత్నాకర్‌ రావు